హైదరాబాద్ : మాజీ సీఎం రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం ధరమ్ కరణ్ రోడ్డులోని రోశయ్య నివాసానికి చేరుకొని పార్థీవదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రోశయ్య సీఎంగా, గవర్నర్‌గా ఇలా అనేక పదవులను అలంకరించి, వాటికి వన్నె తీసుకువచ్చారన్నారు. సందర్భాన్ని బట్టి చలోక్తులు విసిరే వారని, సభలో చాలా హుందాగా వ్యవహరించే వారన్నారు. రోశయ్యను ఎప్పుడు కలిసిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి గురించి అడిగే వారన్నారు. జిల్లా అభివృద్ధికి నిధుల మంజూరు విషయంలో ఎప్పుడు ఏ సహాయం కావాలన్న చేస్తాను అనే వారిని మంత్రి గుర్తు చేసుకున్నారు.