హైదరాబాద్ : నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. భారీ వర్షాలకు ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తున్నది. డ్యామ్ గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ గంగమ్మకు పూజలు చేశారు. మంత్రి కుటుంబ సమేతంగా గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి, హారతి ఇచ్చారు. కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్, నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.