Harish Rao | మీరే నా బలం.. మీరే నా బలగం.. మల్యాలలో మంత్రి హరీశ్‌రావు
Harish Rao | మీరే నా బలం.. మీరే నా బలగం. మీ కోసం ఇంకా కష్టపడుతా.. మరింత సేవ చేస్తా. మీ ఆశీస్సులు, దీవెనలు, మీరిచ్చే బలం ఉన్నంత కాలం మీకు సేవ చేస్తూనే ఉంటానని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామంలో మంత్రి హరీశ్‌రావు గురువారం పర్యటించారు.
Harish Rao | సిద్దిపేట : మీరే నా బలం.. మీరే నా బలగం. మీ కోసం ఇంకా కష్టపడుతా.. మరింత సేవ చేస్తా. మీ ఆశీస్సులు, దీవెనలు, మీరిచ్చే బలం ఉన్నంత కాలం మీకు సేవ చేస్తూనే ఉంటానని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామంలో మంత్రి హరీశ్‌రావు గురువారం పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు జడ్పీ చైర్మన్ రోజాశర్మతో కలిసి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా గ్రామ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. మల్యాల గ్రామానికి గ్రామస్తుల సహకారంతో రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. ఎటు వైపున చూసినా గ్రామ రూపురేఖలు మారిపోయాయని, గల్లీ, గల్లీలో సీసీరోడ్లు వేసుకున్నామని తెలిపారు.
పుట్టబోయే బిడ్డకు న్యూట్రిషన్ కిట్.. పుట్టిన బిడ్డకు ఇచ్చేది కేసీఆర్ కిట్
మరో వారం రోజుల్లో గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందిస్తామని హరీశ్‌రావు తెలిపారు. పుట్టబోయే బిడ్డకు న్యూట్రిషన్ కిట్. పుట్టిన బిడ్డకు ఇచ్చేది కేసీఆర్ కిట్. ఇది కేసీఆర్‌కు ప్రజల మీద ఉన్న ప్రేమగా మంత్రి చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సీఎం కేసీఆర్ అయ్యాక అవ్వ, తాతల గౌరవం పెరిగింది అని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ రాకపోతే ఇంత అభివృద్ధి జరిగేదా అంటూ.. గత గ్రామ అనుభవాలు గుర్తు చేసి, ఇవాళ జరిగిన గ్రామ అభివృద్ధిని వివరించారు. కాళేశ్వరం నీళ్లతో మండుటెండలలో చెరువులు నిండు కుండలుగా తలపిస్తున్నాయని వివరించారు. ఎవ్వరైనా సరే సద్దితిన్న రేవు తలవాలని కోరారు. రూ.200 పింఛన్ రూ.2 వేలు చేశామని పేర్కొన్నారు.
కాళేశ్వరంతో రెండు పంటలు..
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బోర్లు వేసినా నీళ్లు పడక బాధపడ్డారని, తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ హయాంలో ఆ బాధ తప్పిందని, ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేసి ఇచ్చే సంక్షేమ ప్రభుత్వం మనదని మంత్రి హరీశ్ వెల్లడించారు. గతంలో బోరు బావులు తవ్వి డబ్బులు వృథా చేసుకున్నారని, ఇవాళ కాళేశ్వరం నీటితో రెండు పంటలు పండించుకుంటున్నామని నాటి-నేటి పరిస్థితిని హరీశ్‌రావు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎరువుల కొరత ఉండేదని, కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతుల కోసం 24 గంటల నిరంతర విద్యుత్, ఎరువులు తదితర రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం తలపెట్టిన అంశాలు వివరించారు.
రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారికి అండగా ఉంటామని మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. మొదటి విడతలో 40-50 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామ లైబ్రరీకి వారంలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తానని హామీనిచ్చారు. గ్రామంలో 808 రైతులకు రైతుబంధు, అనివార్య కారణాలతో మృతి చెందిన 14 మంది రైతు కుటుంబాలకు రైతుభీమా ఇచ్చి ఆదుకున్నామని తెలిపారు. గ్రామంలో ఇటీవల శిక్షణ పొందిన 21 మందికి కుట్టు మిషన్లు త్వరలోనే అందిస్తామని మంత్రి హామీనిచ్చారు.
అంతకుముందు 30 రోజుల ప్రణాళికతో మంత్రి సహకారంతో మల్యాల గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నామని గ్రామ ప్రజాప్రతినిధులు వివరించారు. గ్రామంలో 18 రకాల అభివృద్ధి పనులు చేసుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

