Kaleshwaram Project | కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీ పంపు హౌస్‌లో నాలుగో పంపు పునఃప్రారంభమైంది. నాలుగో పంపు కూడా విజయవంతంగా నడిచిందని ఈఎన్సీ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు తాత్కాలికం అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఆరోపణలు తాత్కాలికం.. అపర భగీరథుడు కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు శాశ్వతం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రకటించినట్టుగానే, అనతి కాలంలోనే లక్ష్మీ పంప్ హౌస్ మరమ్మత్తులు చేసి, 4 పంప్‌లను అందుబాటులోకి తెచ్చాము. లక్ష్మీ పంప్ హౌస్ పున:ప్రారంభం కావడం సంతోషం, అధికారులకు అభినందనలు అని హరీశ్‌రావు తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఆరోపణలు తాత్కాలికం.. అపర భగీరథుడు కేసీఆర్ గారి మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు శాశ్వతం..!
అసెంబ్లీలో ప్రకటించినట్టుగానే, అనతి కాలం లోనే లక్ష్మీ పంప్ హౌస్ మరమ్మత్తులు చేసి, 4పంప్ లను అందుబాటులోకి తెచ్చాము. లక్ష్మీ పంప్ హౌస్ పున:ప్రారంభం కావడం సంతోషం, అధికారులకు అభినందనలు.. pic.twitter.com/4pcLdxLpK6
— Harish Rao Thanneeru (@trsharish) December 22, 2022