సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి దవాఖానలోని వార్డుల్లో తిరిగి పరిశుభ్రతను పరిశీలించారు. దవాఖాన వెనుక చెత్తాచెదారం ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరుపట్టికను పరిశీలించారు. – హుస్నాబాద్