హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో మరింతకాలం ప్రజా జీవితంలో కొనసాగాలని హరీష్ రావు ఆకాంక్షించారు. హరీష్ రావు ట్వీట్‌కు కేటీఆర్ బదులిస్తూ.. థ్యాంక్స్ బావ అంటూ ట్వీట్ చేశారు.
జగదేక రాముడికి జన్మోత్సవ శుభాకాంక్షలు అని దర్శకుడు ఎన్ శంకర్ ట్వీట్ చేశారు. తనను పెంచిన తెలంగాణను, ఆదర్శ తెలంగాణగా మారుస్తున్న ఆధునిక తారకరాముడు తన పుట్టినరోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చనతో ప్రకృతిని పరవశింప చేస్తున్నందుకు రామన్నను ముక్కోటి దేవతలు దీవించాలని కోరుకుంటున్నాను అని శంకర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Thanks Bava https://t.co/RvAlL7thhU
— KTR (@KTRTRS) July 24, 2021
Thanks Shankar Anna https://t.co/1SBP6RFcKZ
— KTR (@KTRTRS) July 24, 2021
Thanks https://t.co/DC4uZeWxlX
— KTR (@KTRTRS) July 24, 2021