Review On Heavy Rains | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తత, సన్నద్ధతపై ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులతో మంత్రి హరీశ్‌రావు టెలీకాన్ఫరెన్స్ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రాజెక్టుల పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.
అధికారులంతా ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలని, ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రాజెక్టులు, చెరువులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని చెప్పారు. మెదక్ జిల్లాలో 157, సిద్దిపేట జిల్లాలో 257 ఇండ్లు ధ్వంసమయ్యాయని, సంగారెడ్డిలో 227 జిల్లాలు పాక్షికంగా కూలాయని చెప్పారు. వరదల్లో ఇండ్లు కూలిన వారికి అండగా నిలువాలని, ప్రభుత్వం తరఫున కలెక్టర్లు ఆర్థిక సాయం అందించాలన్నారు. నెలలు నిండిన గర్భిణులను ఆసుపత్రిలో చేర్పించాలని సూచించారు.