హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రాథమిక వైద్యరంగాన్ని సీఎం కేసీఆర్ బలోపేతం చేస్తున్నారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో మానిటరింగ్ హబ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 887 పీహెచ్‌సీల్లోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, టీఎస్ఎంఎస్ఐడీసీ అనుసంధానం చేసినట్లు చెప్పారు. ఉన్నతాధికారులు ఎక్కడి నుంచైనా మానిటర్ చేసే అవకాశం కలుగుతుందన్నారు. ఏవైనా ఔట్ బ్రేక్ కలిగిన సమయంలో సలహాలు సూచనలు ఇస్తారన్నారు. డాక్టర్లు ఆయా పీహెచ్‌సీలోని ఫార్మసీ, ల్యాబ్‌ను మాటనిటర్ చేసే అవకాశం కలుగుతుందన్నారు.

మెడికల్ కాలేజీలు, జిల్లా హాస్పిటల్‌తో సంప్రదించి స్పెషాలిటీ సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు. సీసీ కెమెరాలతో సెక్యూరిటీ, సేఫ్టీ ఉంటుందని, ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయడం దేశంలో మొదటిసారన్నారు. 43 పీహెచ్‌సీలకు రూ.67కోట్లతో కొత్త బిల్డింగ్‌లను మంజూరు చేసినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 372 పీహెచ్‌సీల మరమ్మతలను రూ.43.18కోట్లతో చేపట్టినట్లు చెప్పారు. 1239 సబ్ సెంటర్ల కొత్త భవనాలకు మంజూరు ఇచ్చామని, ఒక్కోదానికి రూ.20లక్షల ఖర్చు చేస్తున్నామన్నారు. అన్నింటికి కలిపి మొత్తంగా రూ.247 కోట్లు వెచ్చించామన్న ఆయన.. 1,497 సబ్ సెంటర్లను 59 కోట్లతో మరమ్మతులు చేపట్టినట్లు వివరించారు.

మునుగోడు ఎన్నికతో డాక్టర్ల నియామక ప్రక్రియ ఆలస్యమైందని, 969 పోస్టులకు మెరిట్ లిస్ట్ ప్రకటించినట్లు వివరించారు. వారం పది రోజుల్లో నియామక పత్రాలు అందజేస్తామన్నారు. దీంతో అన్ని పీహెచ్సీలో వైద్యులు ఉంటారని, పల్లె దవాఖానాల కోసం 1,569 పోస్టుల నియామక ప్రక్రియ త్వరలో మొదలవుతుందన్నారు. రాష్ట్రంలో 331 బస్తి దవాఖానలు పని చేస్తున్నాయని, వీటిని 500కు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. ఇప్పటివరకు 2.11 కోట్ల ఓపీ నమోదైందని, వీటి వల్ల ఉస్మానియా, గాంధీ, ఫీవర్ వంటి హాస్పిటల్లపై ఒత్తిడి తగ్గిందన్నారు. 2019లో ఉస్మానియా హాస్పిటల్లో 12 లక్షలు ఓపీ ఉంటే.. ఈ ఏడాది 5 లక్షలకు తగ్గిందన్నారు. గాంధీలో 6.5లక్షల నుంచి 3.70 లక్షలకు, నిలోఫర్‌లో 8 లక్షల నుంచి 5.5 లక్షలకు, ఫీవర్ హాస్పిటల్లో 4 లక్షల నుంచి 2 లక్షలకు తగ్గిందన్నారు. ఫలితంగా అక్కడ సర్జరీల పెరిగాయన్నారు.

తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా ఇప్పటివరకు 36.20 లక్షల మందికి 6.46 కోట్ల టెస్టులు చేసినట్లు మంత్రి వివరించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఏడాది పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని, ప్రజలకు సేవ చేసానన్న సంతృప్తి కలిగిందని తెలిపారు. స్టాఫ్ నర్స్, 1165 స్పెషలిస్ట్ డాక్టర్ నోటిఫికేషన్ త్వరలో ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్రం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినా.. ఇందులో తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇచ్చినా తీసుకుంటామని, స్వయంగా నేనే పత్రాలు తీసుకొని వెళ్లానన్నారు. కిషన్ రెడ్డి చొరవ తీసుకుంటారా? ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. మానిటరింగ్ హబ్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి కుషాయిగూడ, సూర్యాపేట జిల్లా అంబేద్కర్‌నగర్, సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌నగర్ పీహెచ్సీ వైద్యులతో మాట్లాడారు. హరిత, అన్నపూర్ణ అనే పేషెంట్లతో మాట్లాడి, సేవలపై ఆరా తీశారు.