హైదరాబాద్, జనవరి 19(నమస్తే తెలంగాణ): తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు వివేకానంద విదేశీ విద్యా పథకం కింద ఈ ఏడాది మరో 121 మందికి ఆర్థిక సాయం మంజూరైంది.
హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో ఈ నెల 23న మంత్రి హరీశ్‌రావు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. ఈ పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే పేద బ్రాహ్మణ విద్యార్థులకు 20లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తున్న విషయం విదితమే