మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 22, 2020 , 02:15:15

బీజేపీ నయా కుట్ర!

బీజేపీ నయా కుట్ర!

  • బడా కార్పొరేట్‌ ముసుగులో..నయా జమీందారు వ్యవస్థకు ఊతం
  • దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పాలి
  • ఓటర్లకు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపు

దుబ్బాక: రైతులను ఇబ్బందులకు గురిచేసేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో వ్యవసాయ కార్పొరేటీకర ణ బిల్లును ప్రవేశపెట్టిందని, ఆ బిల్లుతో నయా జమీందారు వ్యవస్థకు జీవం పోయనున్నదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణలో రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ఉచిత కరెంట్‌, రైతుబంధు, రైతు బీమా, సాగు నీరు తదితర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, వీటితో ఇప్పుడిప్పు డే రైతుల ముఖాల్లో సంతోషం చూస్తున్నామన్నారు. అయితే ఓర్వలేని కేంద్ర ప్రభు త్వం వ్యవసాయ పొలాల్లో బోరు మోటర్లకు కరెంట్‌ మీటర్లు బిగించేందుకు బిల్లు తెచ్చిందని విమర్శించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతోపాటు దుబ్బాక మండలం పద్మనాభంపల్లిలో సోమవారం రాత్రి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావుకు పద్మనాభంపల్లి వాసులు టీఆర్‌ఎస్‌కు మద్దతు పలుకుతూ తీర్మాన పత్రాన్ని అందజేశారు. మొదట కుల సంఘాల వారీగా తీర్మానాలు అందజేశారు. అనంతరం సర్పంచ్‌, వార్డు సభ్యులంతా టీఆర్‌ఎస్‌కు మద్దతుగా తెలుపుతూ తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న బీజేపీకి వచ్చే దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలంతా ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. 

బీజేపీ, కాంగ్రెస్‌ నాయకుల చేరిక..

దుబ్బాక/తొగుట: దుబ్బాకకు చెందిన బీజేపీ, తొగుటకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు సోమవారం సిద్దిపేటలో టీఆర్‌ఎస్‌ లో చేరారు. దుబ్బాక మండలం రామక్కపేటకు చెందిన పద్మశాలీ సంఘం అధ్యక్షు డు, బీజేపీ సీనియర్‌ నాయకులు బూర శ్రీధర్‌తోపాటు చెపూరి సాగర్‌గౌడ్‌, అహోబిలం బాలకృష్ణ, శ్రీరాం ఆంజనేయులు, వెంకటేశ్‌, స్వామి, అనిల్‌ తదితరులు, తొ గుటకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు పబ్బ తి మల్లారెడ్డి తదితరులను మంత్రి హరీశ్‌రావు టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు.


logo