హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించడంపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘ధరణి విషయంలో బీజేపీది పూటకో మాట, నోటికో మాట. గల్లీ నాయకులు ఒకటి చెప్తే.. ఢిల్లీ నాయకులు ఇంకొకటి చెప్తారు. ధరణిని రద్దు చేయబోమని రాష్ట్ర నాయకులు అంటే.. రద్దు చేస్తామని నిన్న జేపీ నడ్డా అన్నారు. బీజేపీ రెండు నాలుకల ధోరణికి ఇది మరో నిదర్శనం. కాంగ్రెస్ నేతలు ధరణి గురించి ఏమాత్రం అవగాహన లేకుండా గుడ్డిగా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. సుతి లేని బీజేపీ, మతిలేని కాంగ్రెస్’ అంటూ మంత్రి హరీశ్‌రావు సోమవారం ట్వీట్ చేశారు.