జేపీ నడ్డా వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు ఫైర్
హైదరాబాద్ : వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం విషయంలో జేపీ నడ్డా వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. చారిత్రక వరంగల్ నగరాన్ని హెల్త్ సిటీగా మార్చాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. 24 అంతస్తుల్లో 2000 పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.1100 కోట్లు మంజూరు చేసింది. వెనువెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టి, శర వేగంగా పనులు ప్రారంభించింది. మూడు నెలల్లోనే 15 శాతం పనులు పూర్తయ్యాయి. కండ్లుండీ చూడలేని వారికి ఈ అభివృద్ధి కనిపించదు. నోరు తెరిస్తే జూటా మాటలు ప్రచారం చేసే వారికి ఈ హాస్పిటల్ వల్ల కలిగే ప్రయోజనాలు అర్థం కావని హరీశ్‌రావు పేర్కొన్నారు.
వరంగల్ లో నిర్మాణంలో ఉన్నది ఆస్పత్రి మాత్రమే కాదు.. ప్రభుత్వ రంగంలో దేశంలోనే నిర్మించబడుతున్న ఒకే ఒక అధునాతన హెల్త్ సిటీ. ఇది పూర్తయితే ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందటంతో పాటు వైద్య విద్య , పరిశోధనలకు కేంద్రంగా వరంగల్ నిలుస్తుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
చారిత్రక వరంగల్ నగరాన్ని హెల్త్ సిటీగా మార్చాలని కేసీఆర్ గారు సంకల్పించారు. 24 అంతస్తుల్లో 2000 పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.1100 కోట్లు మంజూరు చేసింది. వెనువెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టి, శర వేగంగా పనులు ప్రారంభించింది. 1/3 https://t.co/X1kRauSxG5 pic.twitter.com/VqR6aO6gwJ
— Harish Rao Thanneeru (@trsharish) August 27, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

