Minister Harish Rao | ప్రముఖ తెలుగు సినీ నటుడు చంద్రమోహన్ మృతిపై రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు సంతాపం తెలిపారు. తన విలక్షణమైన నటనతో సుదీర్ఘకాలం పాటు తెలుగు ప్రేక్షకులను అలరించి.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారన్నారు. ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు.
ఆయన ఆత్మకు శాంతికలగాలని భగవంతున్ని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. చంద్రమోహన్ మృతికి ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలం సంతాపం తెలిపారు. హీరోగా, కమెడీయన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దాదాపు 900పైగా చిత్రాల్లో నటించి మెప్పించారన్నారు. ఫిలింఫేర్, నంది అవార్డులను సైతం అందుకున్నారన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. కుటుంబ సభ్యకుల ప్రగాఢ సానుభూతి తెలిపారు.