హైదరాబాద్ : త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ మృతిపట్ల ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు 11 మంది సైనికులు మృతి చెందడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నానని హరీశ్‌రావు తెలిపారు.
Extremely unfortunate for us to have lost our decorated officer, India’s first CDS Bipin Rawat ji, his wife and 11 army officers in a tragic chopper crash today. I join my countrymen to extend our condolences and prayers for their families. We stand together in grief today. pic.twitter.com/nbUBwp2atl
— Harish Rao Thanneeru (@trsharish) December 8, 2021