సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 08, 2020 , 14:08:17

విద్యుత్‌శాఖకు రూ.10,416 కోట్లు...

విద్యుత్‌శాఖకు రూ.10,416 కోట్లు...

హైదరాబాద్‌:  రాష్ట్ర బడ్జెట్‌లో విద్యుత్‌ శాఖకు రూ.10,416 కోట్లు కేటాయించడం జరిగిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో తీవ్ర విద్యుత్‌ సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం. రాష్ట్ర ప్రగతికి తీవ్ర అవరోధంగా మారిన విద్యుత్‌ సమస్య పరిష్కారాన్ని సీఎం కేసీఆర్‌ ఛాలెంజ్‌గా తీసుకున్నారు. కరెంట్‌ కష్టాలను రూపుమాపేందుకు వ్యూహాలు రూపొందించి అమలు చేశారు. దాని ఫలితంగానే కరెంట్‌ కష్టాలను పూర్తిగా అధిగమించాం. నేడు వ్యవసాయ రంగంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల పాటు నిరంతర విద్యుత్‌ సరఫరా చేసుకోగలుగుతున్నాం. రైతులకు 24గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంగా దేశం ముందు సగర్వంగా నిలబడింది. 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర చరిత్రలోనే 13,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ ఏర్పడితే, తెలంగాణ రాష్ట్రంలో 13,168 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ వచ్చింది. ఇంత డిమాండ్‌ వచ్చినా ఒక్క సెకండ్‌ కూడా కరెంట్‌ పోకుండా విద్యుత్‌ సరఫరా చేయగలగడం మనం సాధించిన విజయానికి సంకేతమని తెలిపారు. 


logo