సిద్దిపేట : మంత్రి హరీశ్‌రావు సామాన్య కార్యకర్తలా మారారు. మంత్రి హోదాను పక్కన పెట్టి సిద్దిపేట మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి తానే స్వయంగా బస్సుల్లో పార్టీ శ్రేణులను సీఎం కేసీఆర్ సభకు తరలించి కార్యకర్తలో జోష్‌ను నింపారు.
కాగా, మల్లన్నసాగర్ జలాశయాన్ని సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభించనున్నారు. మల్లన్న సాగర్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ సభకు మంత్రి దగ్గరుండి పార్టీ శ్రేణులను తరలించారు.
మధ్యాహ్నం ముఖ్యమంత్రి సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ చేరుకుంటారు. అక్కడ నిర్మించిన పంపుహౌజ్‌ను పరిశీలించి మోటర్లు ఆన్ చేస్తారు. ఈ మోటార్ల ద్వారా మల్లన్నసాగర్‌లోకి దుంకుతున్న జలాలకు శాస్త్రోక్తంగా సారె సమర్పిస్తారు. పూలు, పండ్లు, వస్ర్తాలతో అభిషేకిస్తారు.