హైదరాబాద్: తెలంగాణ ఆడపడుచులకు మంత్రి హరీశ్ రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజులపాటు జరుపుకునే పండుగ బతుకమ్మ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, ఔన్నత్యానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మంత్రి హరీశ్ ట్వీట్ చేశారు.
‘తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా. దేశంలోనే పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ గోప్పపండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికి బతుకమ్మ పండగ శుభాకాంక్షలు.’ అని మంత్రి హరీశ్ రావు ట్విటర్లో పోస్టు చేశారు.