తిరుమల : ఏడుకొండల స్వామి కొలువుదీరిన తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి గోగర్భం డ్యాం ( Gogarbam Dam ) సర్కిల్ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
బుధవారం 78,723 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 37,664 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా చెల్లించుకున్న కానుకల వల్ల హుండీకి రూ.4.43 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. 4.48 లక్షల లడ్డూలను విక్రయించగా 3.04 లక్షల మందికి అన్నప్రసాదం అందించామని వెల్లడించారు.