Minister Gangula | తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతిలో పెట్టొద్దు : మంత్రి గంగుల కమలాకర్
Minister Gangula | యాభై ఏండ్లుగా తెలంగాణకు రోడ్లు, నీళ్లు, కరెంటు తేని మోసగాళ్ల పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. శుక్రవారం కొత్తపల్లి మండలం నాగుల మల్యాల గ్రామంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
కరీంనగర్ : యాభై ఏండ్లుగా తెలంగాణకు రోడ్లు, నీళ్లు, కరెంటు తేని మోసగాళ్ల పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. శుక్రవారం కొత్తపల్లి మండలం నాగుల మల్యాల గ్రామంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గ్రామస్థులు గంగుల కు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర చేసి ఇంటింటికి తిరుగుతూ ఓటును అభ్యర్థించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతిల్లో పెట్టకండి, తెలంగాణను మరింత అభివృద్ధి చేసుకోవడానికి కేసీఆర్ చేతుల్లో పెట్టాలని ఆయన కోరారు. గతంలో మన తాతలు ఆంధ్రలో కలపడం వల్ల 60ఏండ్లు అరిగోస పడ్డామని, అరవై ఏళ్లు వెనకబాటుకు గురయ్యామని, ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలకు ఓటేసి అదే తప్పును మళ్లీ మనం చేయొద్దని వేడుకున్నారు. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి తర్వాత ఎంపీగా గెలిపించారు.
కానీ ఏనాడైనా మీ సమస్యల కోసం మీ దగ్గరికి వచ్చారా అని ప్రశ్నించారు. మళ్లీ నేడు ఓట్లకోసం వస్తున్నాడని, ఇలాంటి వాళ్లపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనునిత్యం అందుబాటులో ఉంటూ స్థానికంగా నీళ్లు, కరెంటు తెచ్చి రోడ్లు వేయించి, వాటి రిపేర్లను సైతం చేయిస్తూ మీ సేవ చేస్తున్న వ్యక్తిగా మరోసారి స్థానికంగా ఉండే తనకు అవకాశం ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

