కరీంనగర్ : దుర్మార్గుడు, అవినీతిపరుడు బండి సంజయ్(Bandi Sanjay) అని, తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి తన కుటుంబాన్ని వేధించాడని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) ఫైర్ అయ్యారు. శుక్రవారం కరీంనగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. గతంలో తన కుటుంబం ఊర్లో లేనప్పుడు తన ఇంటిపై దాడి చేసి, తాళాలు పగలగొట్టి దౌర్జన్యం చేశాడన్నారు.
కేంద్ర ప్రభుత్వం తన చేతిలో ఉందని సీబీఐ, ఈడీ, ఐటీ ఉందని అహంకారంతో దాడి చేయించారని ఆరోపించారు. బండి లాంటి దుర్మార్గునికి, అవినీతి పరునికి ఓటేద్దామా అని ప్రశ్నించారు.బండి సంజయ్ లాంటి వ్యక్తులు ఎన్ని కుయుక్తులు పన్నినా..తనను కడుపులో పెట్టుకొని కాపాడుతున్న కరీంనగర్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఈ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. మరింతగా కరీంనగర్ అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు.