హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన బీసీ గురుకుల విద్యార్థులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula)అభినందించారు. మంగళవారం వెల్లడయిన ఇంటర్ ఫలితాల్లో(Inter Results) ఎంపీసీ విభాగంలో 32 మంది విద్యార్థులు 4,5, 6 ర్యాంకులు ,బైపీసీలో 9 మంది విద్యార్థులు 6,7 ర్యాంకులు సాధించారు.సీనియర్ ఇంటర్ లో 44మంది విద్యార్థులకు పదిలోపు ర్యాంకులు,జూనియర్ ఇంటర్ ఎంపీసీ(MPC)లో 230 మంది విద్యార్థులు 1,2 ర్యాంకులతో సహా పది లోపు ర్యాంకులు సాధించారు.
బైపీసీ(BPC)లో 55 మంది విద్యార్థులు 4,5 ర్యాంకులతో సహా పదిలోపు ర్యాంకులు సాధించారు. హెచ్ఈసీ (HEC) లో ఫస్ట్, సెకండ్ ర్యాంక్, సీఈసీలో 7 గురువిద్యార్థులు పదిలోపు ర్యాంకులు సాధించారు.
ఎంఈసీలో ఐదుగురు విద్యార్థులు 4,6 ర్యాంక్ తో సహా పదిలోపు ర్యాంకులు సాధించగా జూనియర్ ఇంటర్ లో 301 మంది విద్యార్థులకు పదిలోపు ర్యాంకులు సాధించారు.
వృత్తి విద్యా కోర్సుల్లో ప్రతిభ కనబరిచిన 17 విద్యార్థులను, బోధనా సిబ్బందిని మంత్రి గుంగుల కమలాకర్,ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు,బీసీ గురుకుల కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు అభినందనలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ పేద బీసీ విద్యార్థులకు ఉన్నత విద్య అందించే లక్ష్యంతో ప్రభుత్వం బిసీ గురుకుల విద్యాసంస్థలను(Residential Colleges) ఇంటర్మీడియెట్ వరకు అప్ గ్రేడ్ చేసిందని అన్నారు. గతంలో 19గా ఉన్న జూనియర్ కాలేజీల సంఖ్యను 142కు పెంచడంతో వేలాది మంది విద్యార్థులు చదువుకుని తమ జీవితాలను చక్కదిద్దుకునేందుకు మార్గం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.