తిమ్మాపూర్, జూలై 2: కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ రిజర్వాయర్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 2 వేల క్యూసెక్కుల నీటిని మంత్రి గంగుల కమలాకర్.. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌తో కలిసి బుధవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 14 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి కోటి మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని పేర్కొన్నారు. బీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే కాలువలను పునర్నిర్మించి తెలంగాణను తడుపుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు, ఎస్ఈ శివకుమార్, ఈఈ నాగభూషణం, డీఈ కవిత, ఏఈలు వంశీ, కాళిదాసు పాల్గొన్నారు.