హైదరాబాద్, ఫిబ్రవరి20 (నమస్తే తెలంగాణ): బీసీ జనగణన, బీసీ మం త్రిత్వ శాఖ ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడిని పెంచాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ బీసీ నేతలకు పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రవికృష్ణ మర్యాదపూర్వకంగా సోమవారం మం త్రిని కలిశారు.
ఈ సందర్భంగా రవికృష్ణకు మంత్రి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ దేశంలో సీఎం కేసీఆర్ మినహా ఎవరూ బీసీల సంక్షేమానికి ఇం తలా పాటుపడటం లేదని చెప్పారు. పనిచేసే తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలువాలని, బీసీలకు ద్రోహం చేస్తున్న కేంద్రంపై పోరాడాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాడి మల్లయ్యయాదవ్, గోపాల్గౌడ్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.