హైదరాబాద్ : కొత్త రేషన్ కార్డుల జారీపై వస్తున్న తప్పుడు ప్రచారాలు (False propaganda ) నమ్మొద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Kamalakar) కోరారు. సామాజిక మాధ్యమాలతో పాటు ఇతరులు రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై చేస్తున్న సమాచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలైందని వస్తున్న అసత్య ప్రచారాల్ని నమ్మవద్దని కోరారు. ప్రజలను అయోమయానికి గురిచేసేలా తప్పుడు ప్రకటనలను ఎవరు ప్రచారంలోనికి తీసుకురావద్దని సూచించారు.