హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే నెమరుగొమ్ముల సుధాకర్ రావు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం హైదరాబాద్లోని ఆయన ఇంటికి వెళ్లి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సుధాకర్ రావుకు సుదీర్ఘ రాజకీయ జీవితం ఉండాలని, ప్రజాసేవలో వారు కొనసాగాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు. శాలువాతో సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.