వాల్మీకీ మహర్షికి మంత్రి ఎర్రబెల్లి నివాళి
Minister Errabelli | వాల్మీకీ మహర్షి జయంతి సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. ఒక సామాన్యుడైన బోయవాడు అంత గొప్ప కవి కావడం మన దేశ సంస్కృతి

హైదరాబాద్: వాల్మీకీ మహర్షి జయంతి సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. ఒక సామాన్యుడైన బోయవాడు అంత గొప్ప కవి కావడం మన దేశ సంస్కృతి గొప్పదనమని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పండుగలన్నిటినీ ప్రభుత్వమే నిర్వహిస్తున్నదని, గొప్ప కవులు, కళాకారులు, చారిత్రక పురుషుల జయంతి, వర్ధంతులు కూడా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నదని వెల్లడించారు. వాల్మీకీ జయంతిని కూడా సర్కారే నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. ఇలా ఒక్క తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదన్నారు.

వాల్మీకీ రాసిన రామాయణం భారత ప్రజల పారాయణంగా మారింది. మనిషి బతికున్నంతవరకు అది ఉంటుందని చెప్పారు. వాల్మీకీ దక్షిణ భారత దేశమంతా తిరుగుతూ గోదావరి నదీ తీరాన కొంత కాలం ఉన్నాడని, అలా పాలకుర్తి నియోజకవర్గంలోని వల్మీడిగా (వాల్మీకీపురం) మారిన గుట్టల్లో కొంత కాలం తపస్సు చేశాడని చెబుతారని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

