Minister Errabelli | ఏసీ గదుల్లో ఉండేవాళ్లు కావాలో.. మీతో ఉండే ఎండల తిరిగే దయన్న కావాలో ప్రజలు ఆలోచన చేయాలి : మంత్రి ఎర్రబెల్లి
Minister Errabelli | సీఎం కేసీఆర్ దయ, మీ ఆశీర్వాదంతో పాలకుర్తి(Palakurthi) నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాను. మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వద సభ(Praja Ashirvada Sabha)లో సీఎం కేసీఆర్‌తో కలిసి పాల్గొన్నారు.
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ దయ, మీ ఆశీర్వాదంతో పాలకుర్తి(Palakurthi) నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాను. మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తిలో నిర్వ హించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వద సభ(Praja Ashirvada Sabha)లో సీఎం కేసీఆర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నన్ను మంత్రిగా చూడకుండా దయన్న అంటూ మీ మనిషిగా చూసుకున్నారు.
మీరిచ్చిన బలంతో పోటీపడి నియోజకవర్గంలో అభివృద్ధి చేశానన్నారు. కరోనా సమయంలో ఎవరైనా అక్కరకొచ్చారా? అని ప్రశ్నించారు. నేను ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడుకున్నాను. అంబులెన్సులు, నిత్యావసర సరకులు అందించాను. రెండు వేల మందిని బతికించానని పేర్కొన్నారు. మీ కండ్ల ముందు ఉంటా. ఇంటి ముందర ఉంట. ఏ రాత్రి కష్టం వచ్చినా మీకు తోడుగా ఉంటానని హామీనిచ్చారు.
ఏసీ గదుల్లో ఉండేవాల్లో కావాలో మీతో ఉండే ఎండల తిరిగే దయన్న కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాను. సంగెం టెక్ట్స్‌టైల్స్ పార్కులో ఉద్యోగాలు ఇప్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే నూట యాభై గ్రామాలకు నీళ్లు ఇచ్చాం. మరో ఇరవై గ్రామాలకు నీరందిస్తాం.
మరిన్ని డబుల్ ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. పాలకుర్తి సోమేశ్వర స్వామి ఆలయాన్ని, వల్మిడి ఆలయాన్ని, సన్నూరు వేంకటేశ్వర స్వామి ఎంతో అభివృద్ధి చేశాం. పాలకుర్తిలో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. అలాగే సంచార జాతులకు గుర్తింపు కార్డులు ఇప్పించాలన్నారు. మరిన్ని అభివృద్ధి పనులు చేసేందుకు కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

