వరంగల్ : జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి స్థలాన్ని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. వరంగల్ పట్టణానికి సమీపంలో ఉన్న శంభునిపేటలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..స్థలం ఖరారు అయితే వెంటనే భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. నాణ్యతా ప్రమాణాలతో భవన నిర్మాణం చేపట్టి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.