యాదాద్రి భువనగిరి :బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తమ ఇంటి ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు.
ఆ భగవంతుడి దీవెనలతో మీరు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో ఉండాలని, ఉన్నత పదవులు అలంకరించాలని, రాష్ట్రంలో, దేశంలో brs ప్రభుత్వం అధికారంలోకి రావాలని కూడా ఆకాంక్షించినట్లు మంత్రి తెలిపారు. అలాగే కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పలుచోట్ల అనాథ పిల్లలకు పండ్లు, దుస్తులు పంచిపెట్టారు. గిఫ్ట్ ఏ స్మైల్ క్యాక్రమంలో భాగంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నిరుపేద మహిళకు ఇంటిని నిర్మించ అందజేశారు. దేశ విదేశాల్లోను మంత్రి కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను జరుపుకున్నారు.