e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home News పోలీసు అమ‌ర‌వీరుల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి ఘ‌న నివాళులు

పోలీసు అమ‌ర‌వీరుల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి ఘ‌న నివాళులు

హైద‌రాబాద్ : విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘన నివాళులు అర్పించారు. అక్టోబర్ 21, పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరుల సేవలను మంత్రి స్మరించుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలొడ్డిన పోలీస్ అమరుల సేవలను ప్రజలు ఎన్నటికీ మరువరని అన్నారు.

అమరుల స్ఫూర్తితో పోలీసులు తమ విధి నిర్వహణకు పునరంకితం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. అమరులైన పోలీసు కుటుంబాలను ఆదుకోవడానికి, వారి సంక్షేమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు గుర్తు చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement