వరంగల్, ఆగస్టు 20: తెలంగాణలో మతచిచ్చు పెట్టొద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బీజేపీ నేతలకు సూచించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కార్యాలయంలో అశోక స్తూపాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. మోదీ సర్కారు నయా పైసా ఇవ్వకున్నా తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. అనంతరం ముగ్గుల పోటీలను పరిశీలించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.