రాయపర్తి, సెప్టెంబర్ 22 : వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామ రెడ్డి సంఘం ప్రతినిధులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మద్దతు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఎర్రబెల్లిని మరోసారి గెలిపించుకుంటామని వారు తీర్మానం చేశారు. ఈ తీర్మాన ప్రతిని రెడ్డి సంఘం సభ్యుడు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పూస మధు సారథ్యంలో ప్రతినిధులు శుక్రవారం పర్వతగిరిలో మంత్రిని కలిసి అందజేశారు.