జనగామ: వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం, జనగామ జిల్లాల్లోని దేవరుప్పుల, రాయపర్తి మండలాల నుంచి వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దేవరుప్పల మండలం పెద్దతండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుగులోత్ సుధాకర్ నాయక్, యువజన నాయకులు గుగులోత్ సురేందర్, ప్రవీణ్, అనిల్, నవీన్, గుగులోత్ సుజిత్, సుమన్ తదితరులు కాంగ్రెస్ పార్టీని వీడి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఅర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ దరావత్ రాంసింగ్, ప్రధాన కార్యదర్శి చింత రవి, గ్రామ పార్టీ అధ్యక్షుడు తాన్ సింగ్, సర్పంచ్ కోక్య నాయక్, ఎంపీటీసీ గుగులోత్ ఆశా జ్యోతి భగవాన్, హేము నాయక్, యువజన నాయకులు గుగులోత్ పవన్, రాంసింగ్, విజయ్, మంగు తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా సన్నూరు గ్రామ కాంగ్రెస్ నుంచి ఆ గ్రామ పార్టీ అధ్యక్షుడు పోతుల కొమరుమల్లు, గ్రామ సర్పంచ్ నలమాస సారయ్య, ఉప సర్పంచ్ పయ్యాల కొమురుమల్లు సహా వారి అధ్వర్యంలో చిన్నపాక రవి, చరేష్, శ్రీకాంత్ సురేష్, లాదెళ్ల గణేష్ చెరిపెల్లి వెంకన్న, బంగాళా శ్రీకాంత్, చెరిపెల్లి మధు, చిన్నపాక ప్రవీణ్, చెరిపెల్లి ప్రభు, శ్రీధర్, శ్రీకాంత్, చిన్నపాక మణికంఠ, చెరిపెల్లి దర్గయ్య, చిన్నపాక విజయ్, చెరిపెల్లి ఎల్లయ్య, దయాకర్, యాకయ్య, చిన్నపాక సంజీవ, సాయిలు, అనిల్, దుర్గయ్య, లాదెళ్ల నరసయ్య, ఆరెళ్ల ఎల్లయ్య, కాగిత లక్ష్మీనరసు, చినపాక రాజు, చినపాక కుమారస్వామి, యాగ స్వామి, రమేష్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కొల్లన్ పల్లి గ్రామ కాంగ్రెస్ నుంచి వంగాల నరసయ్య, శ్రీనివాస్, చిట్యాల వెంకటేశ్వర్లు, ఎం రంగాచార్యులు, తోట యోగానందం, ఫణికర నాగరాజు, మిట్టపల్లి శ్రీను, భాస్కర్, కనికర కొమురయ్య, నాగండ్ల మహేందర్, చిట్యాల సురేష్, సత్తూరి వెంకన్న, మిట్టపల్లి రాజు, గజ్జి అనిల్, కాడబోయిన రాజు, బెల్లి సాంబరాజు, గోనెల ప్రశాంత్, కాడబోయిన వేణు, ఫణికర రాకేష్, నాగండ్ల హరీష్, మిట్టపల్లి నాగరాజు, బల్ల శ్రీనివాస్, మాచర్ల సోమ నారాయణ, బీసుబోయిన శేఖర్ తదితరులు మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉడతల్ల కృష్ణతోపాటు వెంకన్న, అనుగాల్ తదితరులు కాంగ్రెస్ పార్టీని వీడి, బీఅర్ఎస్ పార్టీలోకి వచ్చారు. వారికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.