అబిడ్స్, డిసెంబర్ 22: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కొత్త అధ్యక్షుడిగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నియమితులయ్యారు. గతంలో అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావు తన పదవికి రాజీనామా చేయడంతో ఎగ్జిబిషన్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించి, ఏకగ్రీవంగా శ్రీధర్‌బాబును ఎన్నుకున్నది.
జనవరి 1న ప్రారంభం కానున్న 83వ అఖిల భారత పారిశ్రామిక ఎగ్జిబిషన్‌కు సీఎం రేవంత్‌రెడ్డిని ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తామని సొసైటీ ప్రతినిధులు తెలిపారు.