హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నకిలీ మందుల(Counterfeit drugs) తయారీదారులపై ఉక్కు పాదంతో అణిచివేయడానికి చర్యలు చేపట్టింది. నకిలీ మందుల నివారణకై నిరంతర పర్యవేక్షణ కోసం నూతనంగా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ నియామకాలను చేపట్టిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ(Damodar Rajanarsimha) అన్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మెరిట్ ఆధారంగా ఎంపికైన 17 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లకు(Drug inspectors) మంత్రి దామోదర్ రాజనర్సింహ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఎంపికైన ది డ్రగ్స్ డ్రగ్ ఇన్స్పెక్టర్లు శాఖ బలోపేతానికి కృషి చేయాలని ఆదేశించారు. ఎంతో బాధ్యతగా సమాజ హితం కోసం ఉద్యోగ విధులను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, డైరెక్టర్ జనరల్ ఆర్వీ కర్ణన్, జాయింట్ డైరెక్టర్ రామ్ దాన్ పాల్గొన్నారు.