Azharuddin | హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి అజారుద్దీన్‌కు ప్రభుత్వం శాఖ కేటాయించింది. అజారుద్దీన్‌కు మైనార్టీ సంక్షేమ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 31వ తేదీన అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ప్రమాణస్వీకారం చేసిన నాలుగు రోజులకు అజారుద్దీన్‌కు శాఖ కేటాయించారు. మొత్తంగా రాష్ట్ర కేబినెట్లో మంత్రుల సంఖ్య 15కు చేరింది. మరో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైనార్టీల ఓట్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముస్లింకు హోంశాఖ ఇచ్చారు. ఇప్పుడు కూడా హోంశాఖను నాకు కేటాయించి ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యం కల్పించాలి’ అని అజారుద్దీన్ సీఎం రేవంత్‌ను కోరినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తనకు హోం శాఖ ఇస్తేనే ముస్లిం మైనార్టీలు ప్రభుత్వాన్ని నమ్ముతారని, జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ అనవసర చర్చలకు తావులేకుండా శాఖల కేటాయింపు వీలైనంత త్వరగా ముగించాలని అజారుద్దీన్ కోరినట్టు తెలిసింది. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి తన వద్ద ఉన్న కీలక శాఖలు ఎవరికీ ఇచ్చేది లేదని, మైనార్టీ వెల్ఫేర్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని చెప్పినట్టు సమాచారం. జూబ్లీహిల్స్‌లో ఓడినా పోయేదేమీ లేదు.. హోంశాఖ మాత్రం ఇంకొకరికి ఇచ్చే ప్రసక్తి లేదని తెగేసి చెప్పినట్టు ప్రచార అవుతున్నది. ఆ మేరకే అజారుద్దీన్‌కు మైనార్టీ సంక్షేమ శాఖ, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది.