తాడ్వాయి, అక్టోబర్ 26 : వచ్చే ఫిబ్రవరి 12 నుంచి మినీ మేడారం జాతర నిర్వహించనున్నట్టు పూజారు ల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు తెలిపారు. పూజారుల సం ఘం ఆధ్వర్యంలో సమ్మక్క, సారల మ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల పూజారులు అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో శనివారం సమావేశమయ్యా రు. ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం మినీ జాతర తేదీలపై పెద్దలతో కలిసి చర్చించారు. ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు నాలుగు రోజలపాటు మినీ జాతరను నిర్వహించాలని నిర్ణయించారు. మినీ జాతర (మండె మెలిగే పండగను) పురస్కరించుకొని అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురావ డం మినహా మిగతా అంతా మహాజాతర మాదిరిగా నిర్వహించనున్నారు.