మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 12, 2020 , 01:16:43

సంక్షోభంలో కూడా సంక్షేమం

సంక్షోభంలో కూడా సంక్షేమం
  • బడ్జెట్‌ను ప్రశంసించిన అక్బరుద్దీన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆర్థికమాంద్యాన్ని తట్టుకుని నిలబడ్డ తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించలేదని, సమతుల్యతతో కూడిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని మజ్లిస్‌పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ కొనియాడారు. కేంద్రప్రభుత్వ బడ్జెట్‌ దేశాన్ని నిరాశలో ముంచితే రాష్ట్రబడ్జెట్‌ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపిందని ప్రశంసించారు. బడ్జెట్‌పై శాసనసభలో బుధవారం జరిగిన చర్చలో పాల్గొన్న అక్బరుద్దీన్‌..  కేంద్రం వైఫల్యంవల్లనే దేశంలో ఆర్థికసంక్షోభం నెలకొన్నదని ఆరోపించారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రప్రభు త్వం ప్రజలపై ధరలభారం మోపకుండా సొంతవనరులను అభివృద్ధి చేసుకుందని చెప్పారు. హైదరాబాద్‌ సమగ్రాభివృద్ధికి ఏటా రూ.10వేలకోట్ల చొప్పున రూ. 50వేల కోట్లు కేటాయించాలన్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి విడుదలచేసిన నిధుల వినియోగాన్ని పర్యవేక్షించేందుకు జిల్లాస్థాయిలో ప్రత్యేక కమిటీలను వేయాలని అక్బరుద్దీన్‌ కోరారు. వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు తెలంగాణ వక్ఫ్‌ కౌన్సిల్‌ను ఏర్పాటుచేయాలన్నారు.


logo
>>>>>>