Akbaruddin Owaisi | హైదరాబాద్, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ): ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడొచ్చని, ఇబ్బడి ముబ్బడి హామీలు ఇవ్వొచ్చని, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం సవాల్ అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎంఐఎం సభ్యడు అక్బరుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు బుధవారం శాసనసభలోఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన మెస్‌చార్జీలు ఏ మాత్రం సరిపోవని, ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నదని డిమాండ్ చేశారు. రూ.44.33తో ఒకరోజు మూడు పూటలా భోజనం చేయడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. గుడ్డు ధరను కూడా పెంచాలని, మధ్యాహ్న భోజనం చార్జీలు రూ.1.12 పెంచారని దీంతో విద్యార్థులకు ఎలాంటి భోజనం పెడతారని ప్రశ్నించారు.