BRS Party | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. ఎంఐఎం పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇస్మాయిల్, వారి అనుచరులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రహమత్‌నగర్, షేక్‌పేట్ నుండి పలువురు మైనార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మహమ్మద్ ఇస్మాయిల్‌తో పాటు నాయకులందరికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు జీవన్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, మైనార్టీ నాయకులు సలీం, సోహైల్ పాల్గొన్నారు.