హైదరాబాద్, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ): ముగ్గురు మంత్రులు వచ్చా రు.. కాసేపు ముచ్చట్లాడి వెళ్లిపాయారు. ఎజెండాలోని ఒక్క అంశంపైనా చర్చ జరగలేదు. ఏ ఒక్క సమస్యపైనా స్పష్టత ఇ వ్వలేదు. ఊరించి, ఉసూరుమనిపించా రు.. ఇదీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మంత్రులతో ఏర్పాటుచేసిన సబ్‌కమిటీ సమావేశం ఫలితం. మిల్లర్లు ఎదుర్కొంటున్న నాలుగు సమస్యల పరిష్కారం కోసం నలుగురు మంత్రులతో ప్రభుత్వం సబ్‌కమిటీని వేసింది.
ఇందులోని ముగ్గురు మంత్రులు గురువారం హైదరాబాద్ సివిల్‌సైప్లె భవన్లో మిల్లర్ల తో రాత్రి పొద్దుపోయాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చేయాల్సిందేమిటంటే.. ఎజెండాలోని అంశాలపై చ ర్చించాలి, సమస్యలకు పరిష్కారం చూ పాలి. కానీ ఈ రెండూ జరగలేదు. ప్రభు త్వం హడావుడిగా కమిటీ వేస్తే ఇక సమస్యలు పరిష్కారమవుతాయని భావించిన మిల్లర్లకు నిరాశే మిగిలింది.
మంత్రుల సబ్ కమిటీ సమావేశం జరిగిన తీరుపై మిల్లర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కనీ సం ఎజెండా ఏమిటో, ఏం మాట్లాడుకోవాలో కూడా స్పష్టత లేకుండా వచ్చారని పేర్కొన్నారు. వాస్తవానికి గోదాములు అ ద్దెకు తీసుకోవడం, మిల్లర్ల నుంచి బ్యాం కు గ్యారంటీలు, మిల్లర్లకు మిల్లింగ్ చార్జీ లు, డయేజ్ చార్జీల అంశాలపై చర్చించా లి. వాటిలో ఏ ఒక్క అంశాన్నీ మంత్రులు ప్రస్తావించలేదని మిల్లర్లు తెలిపారు.