ముందస్తు బెయిల్ కోసం మిల్లర్ల పిటిషన్లు
రాష్ట్రంలో రైస్ మిల్లులకు సరఫరా చేసిన ధాన్యం మళ్లింపుపై నమోదైన క్రిమినల్ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూ రు చేయాలని కోరుతూ పలువురు మిల్లర్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
- విచారణ 11కు వాయిదా వేసిన హైకోర్టు
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైస్ మిల్లులకు సరఫరా చేసిన ధాన్యం మళ్లింపుపై నమోదైన క్రిమినల్ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూ రు చేయాలని కోరుతూ పలువురు మిల్లర్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం సరఫరా చేసిన ధాన్యాన్ని దారిమళ్లించడం ద్వారా ప్రభుత్వానికి రూ.3,960 కోట్ల నష్టం కలిగించారంటూ దాదాపు 360 రైస్ మిల్లుల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిని కొట్టివేయాలంటూ మిల్లర్లు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు ఇప్పటికే కొట్టివేసింది. దీంతో వారిని అరెస్టు చేసే అవకాశాలున్నందున ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కే సుజన సోమవారం విచారణ చేపట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. ఇదే అంశంపై మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయని తెలిపారు. వా టిని విచారించాలన్న అభ్యర్థనకు న్యాయమూర్తి అనుమతిస్తూ తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

