గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 27, 2020 , 10:11:46

సాయమందించేందుకు ముందుకొచ్చిన మిలాప్

సాయమందించేందుకు ముందుకొచ్చిన మిలాప్

హైదరాబాద్ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగనున్నది. రోజువారీ కూలీలు,చిరువ్యాపారులకు ఆర్థిక సాయం అందించేందుకు  ప్రముఖ క్రౌడ్‌ ఫండింగ్‌ సంస్థ మిలాప్‌ ప్రత్యేక ఆన్‌లైన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులతో పలు సేవలు అందించనున్నట్లు ఆ  సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా milaap.org/covid19 పేజీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.  ఆసుపత్రుల్లో వసతులు , ఆకలితో అలమటించే వారికి సాయమందిచనున్నట్లు వారు వివరించారు.


logo
>>>>>>