దుండిగల్,జూన్1: 33/11కేవీ బాచుపల్లి సబ్‌స్టేషన్, పలు ఫీడర్ల పరిధిలో రాత్రి 10.30 గంటల నుంచి 3 గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో సాయినగర్, ఇంద్రానగర్, ప్రగతినగర్‌లోని జీపీఆర్ లేఅవుట్ కాలనీవాసులు సబ్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరెంటు కోతలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాత్రి 1.30 గంటలకు సరఫరా పునరుద్ధరించడం తో ఆందోళన విరమించారు. ఓవర్‌లోడ్ కారణంగా సరఫరా నిలిచిపోయిందని ఏఈ శాం తకుమార్ తెలిపారు. బొల్లారంలోని టీనాల్యాబ్ వద్ద జంపర్ కట్ కావడంతో వైరుకింద పడి మంటలు చెలరేగినట్లు పేర్కొన్నారు. మరమ్మతుల అనంతరం సరఫరా చేశారు.