Mid Day Meal Workers | హైదరాబాద్ : గత ఐదు నెలలుగా జీతాలు, పెండింగ్ బిల్లులు రాక తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. తమ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మధ్యాహ్న భోజన కార్మికులు.
పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు జిల్లాల నుంచి భారీగా తరలివచ్చి, డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మధ్యాహ్న భోజన కార్మికులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మహిళా కార్మికులందరినీ బలవంతంగా పోలీసు వ్యాన్లలో ఎక్కించి, ఆయా పోలీసు స్టేషన్లకు తరలించారు.
పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడమే కాకుండా తమను అరెస్టు చేయడంపై మహిళా కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం..? ఇదేనా ప్రజా పాలన? అని వారు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. బడి పిల్లలకు భోజనం పెట్టే వ్యవస్థను కూడా సరిగ్గా నడపలేని ఈ చేతగాని రేవంత్ సర్కార్ తీరుపై కార్మికులు మండిపడ్డారు.
5 నెలల జీతాలు, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర ధర్నా చేసిన మధ్యాహ్న భోజన కార్మికులు
జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులు
జీతాలు, పెండింగ్ బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన
రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్న… pic.twitter.com/P531xLzmzs
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2025