Firing @ ORR | హైదరాబాద్ శివారుల్లో కాల్పుల కలకలం చోటు చేసుకున్నది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో శంషాబాద్-తుక్కుగూడ వద్ద ఒక లారీ డ్రైవర్‌పై కారులో వెళుతున్న వ్యక్తి కాల్పులు జరిపినట్లు సమాచారం. ఇది దోపిడీ దొంగల ముఠా పని అని పోలీసులు అనుమానిస్తున్నారు. గురి తప్పడంతో లారీ డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పిందని వినికిడి. బుల్లెట్లు తగిలి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. వైట్ షిప్ట్ డిజైర్ కారులో దుండగుల ముఠా పరారైందని పోలీసులు భావిస్తున్నారు. లారీ డ్రైవర్‌పై రెండు రౌండ్ల కాల్పులు జరిపారని సమాచారం. ఆ లారీలో ఐరన్ లోడ్ ఉన్నట్లు తెలుస్తున్నది.
ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగతనానికా, ఇతర కారణాలతో కాల్పులు జరిపారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.