వరంగల్ చౌరస్తా, నవంబర్ 19: ఎంజీఎం సూపరింటెండెంట్ బాధ్యతలకు డాక్టర్ చిలుక మురళి రాజీనామా చేసిన విషయం మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి తన రాజీనామా పత్రాన్ని డీఎంఈకి అందజేసినట్టు మురళి తెలిపారు. అనారోగ్య కారణాలతో సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన తన రా జీనామా లేఖలో పేర్కొన్నారు. గత సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ములుగు ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌గా బదిలీ కావడంతో జూలై 23న డాక్టర్ మురళి ఎంజీఎం సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చే పట్టారు. ఆయన రాజీనామాను డీ ఎంఈ అంగీకరించకపోవడంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్టు తె లిపారు. ఎంజీఎం డైట్ కాంట్రాక్టు టెండర్ ప్రక్రియలో ఇద్దరు అధికా రులు చేసిన తప్పులు బయటపడ్డాయి. ఈ విషయమై ఉన్నతాధికారులు సీరియస్ కావడంతోనే ఆయన రాజీనామా చేసినట్టు పలువురు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.