Rajiv Sagar | ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ నాయకులకే తెలంగాణలో జీవించే హక్కు లేదని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్పై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలన చూస్తుంటే తెలంగాణలో తుగ్లక్ పాలన గుర్తుకు వస్తుందని తెలిపారు. ఆలోచనలేని విధానాలతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ను రేవంత్ రెడ్డి కావాలనే ద్వేషిస్తున్నాని విమర్శించారు. తెలంగాణ ప్రజల పక్షాన ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ కోట్లాడితే.. తెలంగాణ ఉద్యమకారులపైకి గన్ ఎక్కుపెట్టిన చరిత్ర రేవంత్దని విమర్శించారు.
100 రోజుల్లో ఆరు గార్యంటీలు అమలుచేస్తామని మర్చిపోయిన కాంగ్రెస్ నేతలను త్వరలోనే రాష్ట్ర ప్రజలు తెలంగాణ సరిహద్దుల వరకు తరిమికొట్టాతరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ ప్రజలు మాత్రం కేసీఆర్ పాలనే కావాలంటున్నారని వివరించారు. అది జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్యలను చేస్తున్నారన్నారు. కేసీఆర్ జపం చేయనిదే రేవంత్ రెడ్డికి రోజు గడవడం లేదదన్నారు. కుల గణనపై తెలంగాణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో దాని నుంచి ప్రజలు దృష్టి మళ్లించడం కోసం ఇలాంటి నీచ రాజకీయాలను తెరలేపారని దుయ్యబట్టారు. నీకు ఓట్లేసి గెలిపించిన కొడంగల్ ప్రజల భూములు అల్లుడి ఫార్మా కంపెనీ కోసం లాక్కుందమని చూస్తున్న నిన్ను నీకు ఓట్లేసిన ప్రజలే తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సీఎం పదవికి ఉన్న విలువను రేవంత్ రెడ్డి దిగజార్చుతున్నారని మండిపడ్డారు.