హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ చదువుతున్న 61,135 మంది విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్స్‌కు అర్హత సాధించారని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య తెలిపారు. ఓబీసీ విద్యార్థులు 33,932, ఎస్సీలు 8,446, ఎస్టీలు 5,361, దివ్యాంగులు 43 మంది చొప్పున అర్హత సాధించారని పేర్కొన్నారు. విద్యార్థులంతా https:// schlorships.gov. in వెబ్‌సైట్‌ను సంప్రదించి ఈ నెల 15గా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ చైర్మన్‌గా రమణ్నాయక్
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ‘ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్’ తెలంగాణ రాష్ట్రశాఖ చైర్మన్‌గా ప్రొఫెసర్ రమణనాయక్ బానోతు, గౌరవ కార్యదర్శిగా మర్రి రమేశ్‌ను ఎన్నుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రమణ్నాయక్ను విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(వీవోఏఏటీ) ప్రతినిధి బృందం శనివారం ఘనంగా సన్మానించింది.