తిమ్మాపూర్ : రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్ అయిన సోదరుడికి సెలవు దొరుకకపోవడంతో తన గ్రామం మీదుగా వెళ్తున్న బస్సును ఆపి, డ్రైవర్ సీటులోనే రాఖీ కట్టింది ఓ అక్క! పెద్దపల్లికి చెందిన మెండె రాజు ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రాఖీ పండుగ పూట సెలవు దొరుక లేదు.
శుక్రవారం గోదావరిఖని డిపో నుంచి హైదరాబాద్ వెళ్తున్నాడు. దీంతో రేణికుంటకు చెందిన ఆయన సోదరి తమ్మనవేణి స్వప్న రేణికుంట టోల్గేట్ సమీపంలో బస్సు ఆపి రాఖీ కట్టింది. ఈ దృశ్యం అక్కాతమ్ముళ్ల అనురాగానికి అద్దం పట్టింది.